నాకేం పనిలేదా?: సల్మాన్‌ ఫైర్‌

Salman Khan Reacts to Vivek Oberoi Controversial Tweet - Sakshi

ముంబై : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ మీడియాపై చిందులుతొక్కాడు. తోటి నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ చేసిన వివాదస్పద ట్వీట్‌ విషయాన్ని సల్మాన్‌ ఖాన్‌ ముందు ప్రస్తావించగా.. ‘ట్విటర్‌ చూసుకుంటూ ఉండటానికి నాకేం పనిలేదా..? సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ట్విటర్‌ను నేను అంతగా పట్టించుకోను. నాకంతా సమయం కూడా లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సల్మాన్‌ నటించిన ‘భారత్‌’  చిత్రం విడుదలకు సిద్దం కాగా.. ఆ మూవీ ప్రమోషన్స్‌లో ఈ కండలవీరుడు బిజీగా ఉన్నాడు. కత్రీనా కైఫ్‌, దిశా పటాని, జాకీ ష్రాఫ్‌, టబు, సోనాలి కులకర్ణి వంటి అగ్రతారలు నటించిన ఈ చిత్రం జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక వివేక్‌ ఒబేరాయ్‌ ఒళ్లు మరిచి చేసిన ట్వీట్‌ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌, బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ ఒబేరాయ్‌ షేర్‌ చేసిన మీమ్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఆ ట్వీట్‌కు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ ట్వీట్‌ను తొలిగించి ఒబెరాయ్‌ క్షమాపణలు కోరారు. ‘కొందరికి సరదాగా తోచిన ఓ విషయం.. మరి కొం‍దరికి బాధ కల్గించవచ్చు. గత పదేళ్ల నుంచి నేను మహిళాసాధికారత కోసం పని చేస్తున్నాను. ఎప్పుడు ఏ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు. నేను చేసిన పని వల్ల మహిళలు బాధపడుతున్నారు. అందుకే క్షమాపణలు చెప్తున్నాను. ఆ ట్వీట్‌ కూడా డిలీట్‌ చేశాను’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top