సుదీప్‌కు సల్మాన్‌ అదిరిపోయే గిఫ్ట్‌

Salman Khan BMW M5 Car Gifted To Kiccha Sudeep - Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌కు సల్మాన్‌ ఖరీదైన కారును బహమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని సుదీప్‌ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొన్నాడు. ‘మనం మంచి చేస్తే తిరిగి మనకు మంచే జరుగుతుందని నేను ఎక్కువగా నమ్ముతాను. ఆ నమ్మకం సల్మాన్‌ ఖాన్‌తో మరోసారి రుజువైంది. మా ఇంటికి సర్‌ప్రైజ్‌(బీఎండబ్ల్యూ ఎమ్‌5తో) గిఫ్ట్‌తో సల్మాన్‌ వచ్చారు. నాపై నాకుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు సర్‌. మీతో వర్క్‌ చేయడం అదే విధంగా మమ్మల్ని కలవడానికి మీరు రావడం నాకెంతో గర్వంగా ఉంది’అంటూ సుదీప్‌ ట్వీట్‌ చేశాడు. 

అంతేకాకుండా సల్మాన్‌ ఇచ్చిన కారుతో పాటు అతడితో దిగిన ఫోటోలను కూడా సుదీప్‌ షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక ‘నా అనుకున్న వారిపై సల్మాన్‌ చూపించే ప్రేమ అనంతం’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇక ఇటీవలే విడుదలైన దబాంగ్‌-3 చిత్రంలో సల్మాన్‌తో కలిసి సుదీప్‌ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నెగటీవ్‌ రోల్‌ పోషించిన సుదీప్‌ తన దైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభుదేవా దర్శక​త్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ చిత్రంతోనే సల్మాన్‌, సుదీప్‌ల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సల్మాన్‌ ఇలా తన సన్నిహితులకు, స్నేహితులకు బహుమతులు ఇవ్వడం కొత్తేం కాదు. అంతేకాకుండా వారితో చాలా సరదాగా ఉంటాడు. ఆటలు ఆడుతుంటాడు. ఇక గతంలో తన స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేడయం, తన మేనల్లుడితో కలిసి అల్లరి చేయడం వంటి విషయాలు తెలిసినవే.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top