
'రీమేక్ అయితే చేయను' : సాయి పల్లవి
ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ సినిమాలో భానుమతి
ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ముందు చేయబోయే సినిమాల విషయంలో చాలా కండిషన్సే పెడుతుంది. శేఖర్ కమ్ముల బలవంతం మీదే ఫిదాలో వెస్ట్రన్ డ్రస్ వేశానన్న సాయి పల్లవి.. ఇక మీదల ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి డ్రస్ వేసుకోనని చెప్పేసింది.
అంతేకాదు కథ విషయంలోనూ తన అభిప్రాయాన్ని గట్టిగానే చెపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రీమేక్ సినిమా చేసేందుకు అంగీకరించదట. ఫిధా సినిమాను రీమేక్ చేసినా తను మాత్రం భానుమతి పాత్రలో నటించేది లేదని చెప్పింది సాయిపల్లవి. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న బైలింగ్యువల్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ఈ భామ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.