ఫిదా అయ్యిందా..! | Sai Pallavi 3 Movies agreemnet with Dil Raju | Sakshi
Sakshi News home page

ఫిదా అయ్యిందా..!

Aug 5 2017 10:09 AM | Updated on Sep 17 2017 5:12 PM

ఫిదా అయ్యిందా..!

ఫిదా అయ్యిందా..!

వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఫిదా సినిమా రిలీజ్ అయి రెండు వారాలు గడుస్తున్న

వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఫిదా సినిమా రిలీజ్ అయి రెండు వారాలు గడుస్తున్న ఇప్పటికీ మంచి కలెక్షన్లను సాదిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ఏకంగా 50 కోట్ల గ్రాస్ కు చేరువవుతుండటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం  చేస్తున్నారు. అయితే సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువభాగం సాయి పల్లవి ఖాతాలోకే వెల్లింది.

పల్లవి నటనకు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సినీ జనాలు కూడా ఫిదా అయ్యారు. అందుకే దర్శక నిర్మాతలు వరస ఆఫర్లతో సాయి పల్లవిని ఉక్కిరి బిక్కిర చేస్తున్నారు. కానీ ఈ మల్లార్ బ్యూటీ మాత్రం పాత్రల ఎంపికలో తొందర పడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తుంది. తన క్యారెక్టర్స్ విషయంలో పక్కా క్లారితో ఉన్న సాయి పల్లవి, తనను తెలుగు సినిమాకు పరిచయం చేసిన దిల్ రాజు బ్యానర్ లో వరుస సినిమాలకు అంగీకరించింది. ఈ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు చేసేందుకు సాయిపల్లవి అగ్రిమెంట్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement