తేజ్‌... నిన్ను ప్రేమిస్తున్నా | Sai Dharam Tej and Karunakaran PRE LOOK TEASER | Sakshi
Sakshi News home page

తేజ్‌... నిన్ను ప్రేమిస్తున్నా

Apr 29 2018 12:18 AM | Updated on Apr 29 2018 12:58 AM

Sai Dharam Tej and Karunakaran PRE LOOK TEASER - Sakshi

సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్‌

‘‘నేను, మా డైరెక్టర్‌ ‘తేజ్‌’ పూర్తి సినిమాని ఆడిటోరియంలో చూశాం. సాయిధరమ్‌ తేజ్‌ పాత్ర, నటించిన విధానం నాకు కొత్తగా, సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. మంచి టైమింగ్‌తో ఎంటర్‌టైనింగ్‌గా గొప్పగా నటించాడు. ఫుల్‌టైమ్‌ లవ్‌స్టోరీలో తను నటించడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ అనుకుంటున్నా’’ అని నిర్మాత కె.ఎస్‌.రామారావు అన్నారు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రానికి ‘తేజ్‌’ టైటిల్‌ ప్రకటించారు. ‘ఐ లవ్‌ యు’ అన్నది ఉపశీర్షిక.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ–‘‘తేజ్‌ తన పాత్రలో జీవించాడు. అనుపమా ఎంత మంచి నటో తెలిసిందే. ఇద్దరూ పోటీపడి నటించారు. ప్రేమ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు భావోద్వేగాలతో కుటుంబమంతా కలిసి చూసేలా తెరకెక్కించిన ందుకు కరుణాకరన్‌కు కృతజ్ఞతలు. బ్యాలెన్స్‌ ఉన్న రెండు పాటలు తీయడానికి ప్యారిస్‌ వెళుతున్నాం. మేలో రీ–రికార్డింగ్‌ చేసి, అతి త్వరలో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందంగా, గ్రాండ్‌గా వచ్చింది.

రామారావు సార్‌ మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. చాలా సంతోషంగా ఉంది. ‘తేజ్‌’ గురించి మేం చెప్పడం కంటే సినిమా చూశాక మీరు (ప్రేక్షకులు) చెబితే బాగుంటుంది’’ అన్నారు కరుణాకరన్‌. ‘‘డార్లింగ్‌’ సినిమా తర్వాత కరుణాకరన్‌గారు నాకు మళ్లీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చి, మంచి డైలాగ్స్‌ రాయించారు. ఈ సినిమా కూడా ‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ’ సినిమాల్లా సూపర్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు రచయిత ‘డార్లింగ్‌’ స్వామి. ఈ చిత్రానికి కెమెరా: ఆండ్రూ ఐ., సంగీతం: గోపీసుందర్, సహ నిర్మాత: అలెగ్జాండర్‌ వల్లభ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement