అవును.. నేను రణ్‌బీర్‌‌ గొడవలు పడతాం! | Riddhima Kapoor Gives Funny Answers To Netizens During Live Session In Instagram | Sakshi
Sakshi News home page

మేము ఒకరికొకరం సపోర్టుగా ఉంటాం: రిధిమా

Jun 17 2020 8:36 AM | Updated on Jun 17 2020 9:10 AM

Riddhima Kapoor Gives Funny Answers To Netizens During Live Session In Instagram - Sakshi

ముంబై: ‘నేను.. రణ్‌బీర్‌ కలిస్తే ఇప్పటికీ చిన్న చిన్న గొడవలు పడుతూ.. అల్లరి చేస్తాం’ అంటూ ఆయన సోదరి రిధిమా కపూర్‌ సాహ్ని తెలిపారు. మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన లైవ్‌ చాట్‌లో రిద్దిమాను ఓ నెటిజన్‌ మీరు రణ్‌బీర్‌ ఈ వయసులో కూడా కొట్టుకుంటుంటారా? అని అడగ్గా.. ‘‘అవును.. ఎప్పటికీ’’ అంటూ ఆమె సరదాగా సమాధానం ఇచ్చారు. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం..)


అదే విధంగా ఫిట్‌నెస్‌ పట్ల ఆసక్తి చూపే రిధిమాను... ఓ నెటిజన్‌ మీకు ప్రత్యేకంగా న్యూట్రిషియన్‌ ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ‘అవును.. మా అమ్మే నా న్యూట్రిషియన్’‌ అని సమాధానం ఇచ్చారు. ఇటీవల రిషి కపూర్‌ క్యాన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తన తల్లి నీతూ కపూర్‌ ఏలా ఉన్నారని అడగ్గా.. ‘మేము ఒకరికొకరం అన్ని విషయాల్లో సపోర్టుగా ఉంటాం. ప్రస్తుతం మేమంతా బాగానే ఉన్నాం’’ అంటూ రిద్దిమా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement