ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం! | relation only for love not marriage | Sakshi
Sakshi News home page

ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం!

Jan 10 2016 1:48 AM | Updated on Oct 22 2018 6:02 PM

ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం! - Sakshi

ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం!

సాగర తీరంలో రొమాన్స్ చేస్తున్న బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.......

సాగర తీరంలో రొమాన్స్ చేస్తున్న బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హాలిడే ట్రిప్స్‌లో హాట్‌హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్‌గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. జాన్ అబ్రహాంతో ఈ రేంజ్‌లోనే ప్రేమ కథ నడిపి, అతన్నుంచి విడిపోయారు బిపాసా. జాన్‌తో అంత కాకపోయినా ఆ తర్వాత హర్మాన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి, విడిపోయారు.

సో.. బిపాసా ఈ  హిస్టరీని రిపీట్ చేస్తారా? లేక ఈసారైనా తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళతారా? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పరిశ్రమ అంతా వీరిద్దరి బంధం గురించి కోడై కూస్తుంటే... ఇక సన్నిహితులు చూస్తూ ఊరుకుంటారా? అసలు విషయం తేల్చేశారట. క రణ్‌సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. కానీ, భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్నారు.

చట్టప్రకారం మొదటి భార్య నుంచి విడాకులు పొందకుండా రెండో పెళ్లి చేసుకునే వీలు లేదు. అందుకని, ఇప్పటికి బిపాసా, కరణ్‌ల బంధం ప్రేమ వరకూ ఓకే కానీ.. అది పెళ్లి దాకా వెళ్లడం కష్టం అని తెలుస్తోంది. మరి.. జెన్నిఫర్ నుంచి కరణ్ విడాకులు తీసుకుంటారా? లేక కాపురాన్ని నిలబెట్టు కుంటారా?... రెండోది జరిగితే బిపాసా హిస్టరీ రిపీటే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement