
సౌఖ్యం కోసం!
నలుగురి సౌఖ్యం కోసం ఆలోచించే మంచి మనసున్న వ్యక్తి అతను. ఇతరుల ఆనందం కోసం ఏం చేయడానికైనా వెనకాడడు.
నలుగురి సౌఖ్యం కోసం ఆలోచించే మంచి మనసున్న వ్యక్తి అతను. ఇతరుల ఆనందం కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. అతను యాక్షన్ చేశాడా? ఎంటర్‌టైన్ మెంట్ వేలో వెళ్లాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సౌఖ్యం’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనందప్రసాద్ మాట్లాడుతూ- ‘‘మనుషుల మధ్య అనుబంధాలను స్పృశించే సినిమా ఇది. రవికుమార్-గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యజ్ఞం’ ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే.
దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. టాకీ పూర్తయ్యింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు విదేశాల్లో మూడు పాటల చిత్రీకరిస్తాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తాం. డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘పదేళ్ల తర్వాత గోపీచంద్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. గోపీచంద్, రెజీనా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.