లెస్బియన్‌గా రెజీనా..!

Regina Has Played the Role of Lesbian in Ek Ladki Ko Dekha Toh Aisa Laga - Sakshi

సౌత్‌లో యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో స్టార్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయిన బ్యూటీ రెజీనా. సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి మీడియం రేంజ్ హీరోలతో పాటు అ! లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించిన రెజీనా స్టార్ హీరోలతో మాత్రం జతకట్టలేకపోయారు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన ఈ భామ ఓ బోల్డ్ క్యారెక్టర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ వారం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘ఏక్‌ లడఖీ కో దేఖాతో ఐసా లగా’. అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా లెస్బియన్‌ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్‌ కపూర్‌ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్‌ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top