రియల్‌గా అంకుల్‌.. రీల్‌పై ఫాదర్‌

real life uncle becomes reel life father for allu sirish abcd - Sakshi

‘‘విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రంలో హీరో ఫాదర్‌ ఎవరు? ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో ఎన్టీఆర్‌ నాన్నగా ఎవరు నటించారు? ఆ సినిమాల్లో నాన్నగా నటించిన నాగబాబుగారే మా సినిమా ‘ఏబిసిడి’లోను నాన్నగా నటిస్తున్నారు’’ అంటున్నారు అల్లు శిరీష్‌ . ‘‘నాగబాబుగారితో ఇది నా మొదటి సినిమా. ఆయన నాకు రియల్‌ లైఫ్‌లో అంకుల్, ఇప్పుడు రీల్‌ లైఫ్‌లో  ఫాదర్‌గా నటిస్తున్నారు. నేను ఈ కథ విన్నప్పుడే తండ్రి పాత్రకు నాగబాబు గారిని తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోయాను.

అనుకున్నట్టుగానే ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవటం ఆనందంగా ఉంది’’ అని కూడా అన్నారు శిరీష్‌. సంజీవ్‌ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ అల్లు శిరీష్‌ హీరోగా మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మధుర శ్రీధర్‌ రెడ్డి, బిగ్‌బెన్‌ సినిమా బ్యానర్‌పై యష్‌ రంగినేని నిర్మిస్తున్న చిత్రం ‘ఏబిసిడి’. రుక్సార్‌ థిల్లాన్‌ కథానాయిక. బాలనటుడు భరత్‌ ఈ చిత్రంలో హీరో శిరీష్‌ ఫ్రెండ్‌గా నటిస్తున్నాడు. కన్నడ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుధా సాంధీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా ధీరజ్‌ మొగిలి వ్యవహరిస్తు్తన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top