నాగ్‌ మల్టీస్టారర్‌లో నాగశౌర్య హీరోయిన్‌

Rashmika Mandanna Signs Nagarjuna Nanis Multi Starrer - Sakshi

కింగ్ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ‍్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను లాంచనంగా ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌ డేట్‌ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రష్మిక మందన హీరోయిన్‌గా నటించనుందట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. నాగ్‌, నానిల మల్టీస్టారర్‌లో ఈ బ్యూటీ నటిస్తే టాలీవుడ్ లో మరింత బిజీ అయ్యే అవుతుందంటున్నారు విశ్లేషకులు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top