అతనితో రెండోసారి... | Rashi Khanna Returning With Gopichand For Next | Sakshi
Sakshi News home page

అతనితో రెండోసారి...

Nov 23 2015 11:42 PM | Updated on Sep 3 2017 12:54 PM

అతనితో రెండోసారి...

అతనితో రెండోసారి...

ముద్దుగా, బొద్దుగా ఉండే రాశీఖన్నాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్‌కి తగ్గట్టుగా ఆఫర్లు రావడం...

ముద్దుగా, బొద్దుగా ఉండే రాశీఖన్నాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్‌కి తగ్గట్టుగా ఆఫర్లు రావడం లేదామెకు. అలాగని రాశీని మరీ తీసి పారేయనవసరం లేదు. తక్కువ ఆఫర్లు వచ్చినా, అవన్నీ మంచివే కావడం విశేషం. గోపీచంద్‌తో ‘జిల్’లో కనబడి జిల్‌జిల్ మనిపించిన రాశీఖన్నా, మరోసారి అతనితో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ హీరోగా ఏయమ్ రత్నం పెద్ద కొడుకు ఏయమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం రూపొందనుంది.

ఇందులో గోపీచంద్ సరసన రాశీఖన్నా ఎంపికయ్యారట. నిజంగా రాశీకిది మంచి ఆఫరే. ఆమె ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో ‘సుప్రీమ్’లో నటిస్తున్నారు. రవితేజ సరసన నటించిన ‘బెంగాల్ టైగర్’ వచ్చే నెల 10న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement