అంచనాలను అందుకోలేకపోయాం | Ram Charan's letter about Vinaya Vidheya Rama | Sakshi
Sakshi News home page

అంచనాలను అందుకోలేకపోయాం

Feb 6 2019 3:37 AM | Updated on Feb 6 2019 4:57 AM

Ram Charan's letter about Vinaya Vidheya Rama - Sakshi

రామ్‌చరణ్‌

జనవరి 11... రామ్‌చరణ్‌ నటించిన ‘వినయ విధేయ రామ’ విడుదలైన రోజు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఆ అంచనాలను అందుకోలేకపోయామని మంగళవారం రామ్‌చరణ్‌ మీడియాకి ఓ లేఖ విడుదలచేశారు. ఆ లేఖ సారాంశం...

ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు, నా పట్ల, మా సినిమాల పట్ల మీరు చూపిస్తున్న∙ప్రేమాభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్యగారు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకి కృతజ్ఞుడనై ఉంటాను. మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపచేసే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం.

దురదృష్టవశాత్తు అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఈ సినిమాని అందించలేకపోయాం. మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. అన్ని వేళలా తమ మద్దతు నాకు అందించిన మీడియా మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు.

– ప్రేమతో
మీ రామ్‌చరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement