కేకో కేక...

ram charan new movie is vijaya vidheya rama - Sakshi

రామ్‌చరణ్‌ అండ్‌ టీమ్‌ లొకేషన్‌లో కేక్‌ కట్‌ చేశారు. ఏంటీ? అప్పుడే షూటింగ్‌ పూర్తయ్యిందా? అని ఆశ్చర్యపోకండి. అందుకు టైమ్‌ ఉంది. నటి స్నేహ బర్త్‌డే సెలబ్రేషన్‌ కోసం సెట్‌లో కేక్‌ కట్‌ చేశారు. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్‌ రాజేశ్, వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ‘విజయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోందనీ, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. శుక్రవారంతో 37వ వసంతంలోకి అడుగుపెట్టారు స్నేహ. ఈ సందర్భంగా సెట్‌లోనే ఆమె బర్త్‌డే వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ షెడ్యూల్‌ కంప్లీటైన తర్వాత వైజాగ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుందని టాక్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top