3 లక్షలు దాటిన రజనీ ట్విట్టర్ అభిమానులు | rajinikanth twitter followers number crosses 3 lakh mark | Sakshi
Sakshi News home page

3 లక్షలు దాటిన రజనీ ట్విట్టర్ అభిమానులు

May 8 2014 10:46 AM | Updated on Sep 2 2017 7:05 AM

3 లక్షలు దాటిన రజనీ ట్విట్టర్ అభిమానులు

3 లక్షలు దాటిన రజనీ ట్విట్టర్ అభిమానులు

రజనీకాంత్ ఒక్కసారి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారో లేదో, ఆ మాట అలా చెప్పగానే జనం ఇలా ఆయన వెంట పడ్డారు.

బాషా.. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే. రజనీకాంత్ ఒక్కసారి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారో లేదో, ఆ మాట అలా చెప్పగానే జనం ఇలా ఆయన వెంట పడ్డారు. సూపర్స్టార్ ఎప్పుడు ఏం చెబుతారో, ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారో, ఎక్కడకు వెళ్తారో.. అన్నీ తెలుసుకుందామని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన ట్విట్టర్ ఖాతాను ఫాలో కావడం మొదలుపెట్టారు. రజనీ ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారన్న విషయం ఆనోటా, ఈ నోటా అందరికీ తెలిసిపోయింది. అంతే, ఇంకేముంది.. ఆయన ట్విట్టర్ అకౌంట్ను ఫాలో చేసేవాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.

గురువారం ఉదయం నాటికి రజనీ ట్విట్టర్ను 3.13 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే, రజనీకాంత్ ఇలా కొత్త ట్విట్టర్ ఖాతా తెరుస్తున్నారని తెలిసి, ఆయన పేరును వాడుకోడానికి మరి కొంతమంది కూడా సిద్ధమైపోయారు. ఆయన పేరు మీద నకిలీ ఖాతాలు సృష్టించడం మొదలుపెట్టారు. అయితే అభిమానులకు మాత్రం అసలు ఖాతా ఏదో, నకిలీ ఖాతా ఏదో తెలుసు. అందుకే నకిలీ ఖాతాకు కేవలం వందల్లోనే ఫాలోవర్లు ఉండగా, తలైవాకు మాత్రం ఏకంగా మూడు లక్షల మందికి పైగా అభిమానులు ట్విట్టర్లో వచ్చేశారు. కొచ్చాడయాన్ సినిమా విడుదలయ్యాక ఈ సంఖ్య ఇంకెంత ఎక్కువ అవుతుందో చెప్పలేం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement