breaking news
kochadayan
-
3 లక్షలు దాటిన రజనీ ట్విట్టర్ అభిమానులు
బాషా.. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే. రజనీకాంత్ ఒక్కసారి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారో లేదో, ఆ మాట అలా చెప్పగానే జనం ఇలా ఆయన వెంట పడ్డారు. సూపర్‌స్టార్ ఎప్పుడు ఏం చెబుతారో, ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారో, ఎక్కడకు వెళ్తారో.. అన్నీ తెలుసుకుందామని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన ట్విట్టర్ ఖాతాను ఫాలో కావడం మొదలుపెట్టారు. రజనీ ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారన్న విషయం ఆనోటా, ఈ నోటా అందరికీ తెలిసిపోయింది. అంతే, ఇంకేముంది.. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో చేసేవాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. గురువారం ఉదయం నాటికి రజనీ ట్విట్టర్‌ను 3.13 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే, రజనీకాంత్ ఇలా కొత్త ట్విట్టర్ ఖాతా తెరుస్తున్నారని తెలిసి, ఆయన పేరును వాడుకోడానికి మరి కొంతమంది కూడా సిద్ధమైపోయారు. ఆయన పేరు మీద నకిలీ ఖాతాలు సృష్టించడం మొదలుపెట్టారు. అయితే అభిమానులకు మాత్రం అసలు ఖాతా ఏదో, నకిలీ ఖాతా ఏదో తెలుసు. అందుకే నకిలీ ఖాతాకు కేవలం వందల్లోనే ఫాలోవర్లు ఉండగా, తలైవాకు మాత్రం ఏకంగా మూడు లక్షల మందికి పైగా అభిమానులు ట్విట్టర్లో వచ్చేశారు. కొచ్చాడయాన్ సినిమా విడుదలయ్యాక ఈ సంఖ్య ఇంకెంత ఎక్కువ అవుతుందో చెప్పలేం. Many thanks to everyone for such a warm welcome given to me in twitter — Rajinikanth (@superstarrajini) May 7, 2014 సోషల్ మీడియాలో తనను ఇంతగా ఆదరిస్తున్నందుకు రజనీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయనీ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు రజనీ కేవలం మూడంటే మూడే ట్వీట్లు చేశారు. వాటిలో మొదటిది తాను ట్విట్టర్ ఖాతా తెరిచినట్లు చెప్పడానికి కాగా, రెండోది తమిళంలో రాశారు. మూడోది అదే విషయాన్ని ఇంగ్లీషులో రాశారు. -
బావతో సినిమా చేస్తానంటున్న సౌందర్య
తండ్రి హీరోగా కొచ్చాడయాన్ సినిమా తీసిన రజనీకాంత్ కుమార్తె సౌందర్య.. ఇప్పుడు తన బావ ధనుష్‌తో ఓ సినిమా తీయాలనుకుంటోంది. బాలీవుడ్లో ధనుష్ హీరోగా వచ్చిన 'రాంఝణా' చిత్రం చూసిన సౌందర్య.. అందులో అతడి యాక్షన్ చూసి థ్రిల్లయిపోయింది. సమీప భవిష్యత్తులోనే ధనుష్ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటోంది. ''కుందన్ పాత్రలో బావగారు ఎంత బాగా ఒదిగిపోయారో.. నాకు ఆ సినిమా భలే నచ్చేసింది. ఇక ఆ పాటలు ఊకడా చాలా బాగున్నాయి'' అని ఆమె తెలిపింది. ధనుష్ సినిమాకు దర్శకత్వం వహించాలని తనకు ఉన్నా.. సీనియర్ నటుడు కాబట్టి ఆయన డేట్లు ఇస్తే తప్పకుండా చేస్తానని అంటోంది. '3' సినిమాకు దర్శకత్వం వహించిన రజనీ కుమార్తె ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమ కుటుంబంలో ఒక్క తన భర్త తప్ప.. అందరూ సినిమా పరిశ్రమకు చెందినవాళ్లేనని సౌందర్య చెప్పింది.