1400 మంది డాన్సర్స్‌తో...

Raghava Lawrence uses 1400 dancers for a song - Sakshi

‘ముని, కాంచన, కాంచన–2’ వంటి హారర్‌ కామెడీ చిత్రాలతో దక్షిణాదిలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించిన రాఘవ లారెన్స్‌ ‘కాంచన 3’తో మరోసారి ప్రేక్షకులను వినోదంతో భయపెట్టేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన 3’. ఓవియా, వేదిక కథానాయికలుగా నటించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘కాంచన 3’లో రాఘవ లారెన్స్‌  నట విశ్వరూపం చూపించాడు.

దాదాపు 1400 మంది డాన్సర్స్‌తో అత్యద్భుతంగా ఓ పాటని చిత్రీకరించారు. 400 మంది అఘోరా పాత్రధారులు, 1000 మంది వైవిధ్యమైన లుక్‌తో 6 రోజుల పాటు ఈ సాంగ్‌ షూట్‌ చేశారు. ఈ పాట కోసం కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టడం విశేషం. ఈ సినిమా కోసం లారెన్స్‌ చాలా కష్టపడ్డాడు. తన కెరీర్‌లో ‘కాంచన 3’ ప్రత్యేకమైంది. ఇందులో కథ, కథనం, గ్రాఫిక్స్‌... ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. మంచి సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు. మా బ్యానర్‌లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది’’ అన్నారు. మనోబాల, దేవదర్శిని, సత్యరాజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top