క్వాంటికో తొలి ఎపిసోడ్కు కౌంట్డౌన్ | Priyanka Chopra Hollywood television series Quantico | Sakshi
Sakshi News home page

క్వాంటికో తొలి ఎపిసోడ్కు కౌంట్డౌన్

Sep 26 2015 2:15 PM | Updated on Oct 1 2018 5:16 PM

క్వాంటికో తొలి ఎపిసోడ్కు కౌంట్డౌన్ - Sakshi

క్వాంటికో తొలి ఎపిసోడ్కు కౌంట్డౌన్

బాలీవుడ్ సెలబ్రిటీలు హాలీవుడ్లో నటించటం కామన్ అయితే హాలీవుడ్ సీరియల్స్లో నటించటం మాత్రం చాలా అరుదు. గతంలో అనిల్ కపూర్ లాంటి స్టార్స్ హాలీవుడ్ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసినా పెద్దగా గుర్తింపు మాత్రం...

బాలీవుడ్ సెలబ్రిటీలు హాలీవుడ్లో నటించటం కామన్ అయితే హాలీవుడ్ సీరియల్స్లో నటించటం మాత్రం చాలా అరుదు. గతంలో అనిల్ కపూర్ లాంటి స్టార్స్ హాలీవుడ్ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసినా పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయారు. అయితే ఈ హద్దులను చెరిపేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఇంగ్లీష్ టివి సీరియల్తో హల్చల్ చేస్తుంది.

సెప్టెంబర్ 27న ప్రారంభమవుతున్న క్వాంటికో టెలివిజన్ సీరీస్తో హాలీవుడ్ స్మాల్ స్క్రీన్ మీద సత్తాచాటడానికి రెడీ అవుతోంది ప్రియాంక. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్తో పాటు, ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సీరీస్ సక్సెస్ లో ప్రియాంక పాత్రే కీలకం అన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తన లుక్స్తో ఆకట్టుకున్న ప్రియాంక యాక్షన్ సీన్స్లోనూ అదే స్ధాయిలో నటించింది. ఈ సీరీస్ లో ఎఫ్బిఐ ఏజెంట్ గా నటిస్తుంది ప్రియాంక.

ఇక కథ విషయానికి వస్తే ఎఫ్బిఐలో రిక్రూట్ అయిన కొత్త మంది యువతి, యువకుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వర్జీనియాలోని క్వాంటికోలో ట్రైనింగ్ తీసుకున్న ఈ టీంలో ప్రతి ఒక్కరికి ఎఫ్బిఐలో చేరటం వెనుక ఓ ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ కథ ఏంటి ఎఫ్బిఐలో చేరిన ఈ టీం ట్రైనింగ్ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అన్నదే క్వాంటికో సీరిస్ కథ.

సెప్టెంబర్ 27 రాత్రి పది గంటలకు ఎబిసి ఛానల్ లో ఈ సీరిస్ తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అంతర్జాతీయ స్ధాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సీరిస్ టెలివిజన్ టిఆర్పీ చరిత్రలో సరికొత్త రికార్డ్లను సెట్ చేస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement