హాలీవుడ్‌కు ప్రియాంక గుడ్‌బై | Priyanka Chopra Back to Bollywood | Sakshi
Sakshi News home page

Mar 31 2018 8:20 PM | Updated on Mar 31 2018 8:20 PM

Priyanka Chopra Back to Bollywood - Sakshi

సాక్షి, ముంబై : నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పబోతోంది. తిరిగి ఆమె బాలీవుడ్‌ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైపోతున్నట్లు తెలుస్తోంది. స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించే ఛాన్స్‌ రావటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందంట. 

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా అలీ అబ్బాస్‌ జఫర్‌ డైరెక్షన్‌లో ‘భరత్‌’  అనే సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రియాంకను సంప్రదించటం.. స్క్రిప్‌ నచ్చటంతోపాటు హీరో సల్మాన్‌ కావటంతో పిగ్గీ చోప్స్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’ తర్వాతి సిరీస్‌లో నటించలేనని నిర్వాహకులకు చెప్పేసిందని సమాచారం. అయితే దీనిపై భరత్‌ మేకర్లు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గతంలో సల్లూతో కలిసి ప్రియాంక ‘ముజ్‌సే షాదీ కరోగీ, సలామ్‌-ఇ-ఇష్క్‌, గాడ్‌ తుస్సీ గ్రేట్‌ హో చిత్రాల్లో నటించారు. చివరగా ప్రియాంక చోప్రా ప్రకాశ్‌ ఝా జై గంగాజల్‌(2016)లో నటించిన విషయం తెలిసిందే. సౌత్‌ కొరియన్‌ మూవీ ఒడే టూ మై ఫాదర్‌(2014) చిత్రానికి రీమేక్‌గా భరత్‌ తెరకెక్కబోతోంది. 2019 ఈద్‌ సందర్భంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్లను లోబరుచుకోవటంపై ప్రియాంక, అలాంటి కామాంధులు అంతటా ఉంటారు

Advertisement
 
Advertisement
Advertisement