బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’ | Priyank Sharma and Benafsha Soonawalla Make Relationship Official In Social Media | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ప్రేమను బయటపెట్టిన బిగ్‌బాస్‌ జంట

Apr 6 2020 3:48 PM | Updated on Apr 6 2020 4:01 PM

Priyank Sharma and Benafsha Soonawalla Make Relationship Official In Social Media - Sakshi

హిందీ బిగ్‌బాస్‌ 11 కంటెస్టెంట్స్‌ ప్రియాంక్‌ శర్మ, బెనాఫ్‌షా సూనావాలా వారి రిలేషన్‌షిప్‌ను సోషల్‌ మీడియాలో ప్రకటించారు. రెండేళ్లు నుంచి సిక్రేట్‌గా డెటింగ్‌లో చేస్తున్న ఈ జంట వారి ప్రేమను సోమవారం అధికారంగా వెల్లడించారు.  ప్రియాంక్‌ వారిద్దరూ సన్నిహితం ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘అవును ప్రేమలో ఉన్నాం’ అనే క్యాప్షన్‌కు హర్ట్‌ ఎమోజీని జత చేసి షేర్‌ చేశాడు. అలాగే బెనాఫ్‌షా కూడా అదే చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది. ‘మా ప్రేమను అందరిలాంటి ప్రేమలా చూడకండి. ఎందుకంటే నాది అసాధారణమైన ప్రేమ’ అంటూ ఆమె రాసుకొచ్చింది. (వైరల్‌ ట్వీట్‌: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్‌)

Confirmation ❤️

A post shared by Priyank Sharma (@priyanksharmaaa) on

కాగా వారిద్దరి పోస్టుకు ‘‘ఫైనల్లీ’’ అంటూ నటి హినా ఖాన్‌ బాయ్‌ఫ్రేండ్‌ కామెంట్‌ చేయగా.. కరణ్‌ వాహీ ‘‘మీ ఇద్దరికి పిచ్చి’’ అంటూ కామెంట్‌ చేశాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో సన్నిహితంగా మెలిగిన ఈ జంట బయటకు వచ్చాక కూడా చెట్టపట్టాలేసుకు తిరుగుతూ ప్రేమయాణం సాగించారు. అయితే వారి ప్రేమపై ప్రశ్నించినప్పుడల్లా.. తామీద్దరం స్నేహితులం మాత్రమే అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా బిగ్ బాస్ 11లో కంటెస్టెంట్‌గా రావడానికి ముందు బెనాఫ్‌షా, నటుడు వరుణ్ సూద్‌తో డేటింగ్ చేసింది. ఇక హౌజ్‌ నుంచి బయటకు రాగానే వరుణ్‌కు బ్రేకప్‌ చెప్పి ఈ భామ ప్రియాంక్‌తో జతకట్టింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement