కథ బాగుంటే విజయమే | Premanjali Movie Audio Function Director Rvarun Dora Sree Vinayaka | Sakshi
Sakshi News home page

కథ బాగుంటే విజయమే

Dec 19 2017 12:21 AM | Updated on Dec 19 2017 12:21 AM

Premanjali Movie Audio Function Director Rvarun Dora Sree Vinayaka  - Sakshi

‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త జనరేషన్‌ అవసరం. పూరి జగన్నాథ్, గుణశేఖర్‌లాంటి వాళ్లు విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చినవారే. ‘ప్రేమాంజలి’ చిత్రదర్శకుడు వరుణ్‌ది కూడా నర్సీపట్నం కావడం విశేషం. టీజర్‌ చూస్తే మెసేజ్‌ ఉన్న సినిమాలా ఉంది. హిట్‌ అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సుజయ్, శ్వేతానీల్‌ జంటగా వరుణ్‌ దొర దర్శకత్వంలో మహాలక్ష్మి సమర్పణలో ఆర్‌.వి. నారాయణ రావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమాంజలి’. గోవర్ధన్‌ సంగీతం అందించారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్‌ బిగ్‌ సీడీ, దర్శకుడు సాగర్‌ పాటల సీడీ, తమ్మారెడ్డి టీజర్‌ రిలీజ్‌ చేశారు. ‘‘చిన్న సినిమాలు రావడం వల్లే ఇండస్ట్రీలో కొత్త కథలు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్‌ ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు మల్కాపురం శివకుమార్‌. ‘‘ఎటువంటి అవగాహన లేని చిన్న పిల్లలు ప్రేమలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని పేపర్స్‌లో, టీవీల్లో వచ్చే వార్తలు నన్ను ప్రభావితం చేశాయి. అలాంటివాళ్లకు  మెసేజ్‌ ఇవ్వాలని ఈ సినిమా తీశా’’ అన్నారు వరుణ్‌ దొర. సహ నిర్మాత కె.వి. ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజ్‌ నజీర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement