తేడా తెలుసుకోగలిగారా? | Pragya Jaiswal Latest Jewellery Designs | Sakshi
Sakshi News home page

తేడా తెలుసుకోగలిగారా?

Dec 17 2017 1:54 AM | Updated on Dec 17 2017 1:54 AM

Pragya Jaiswal Latest Jewellery Designs - Sakshi

పొద్దున లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు. లైఫ్‌ ఫుల్‌ బిజీ అయిపోయింది. జిందగీ గురించి ఇప్పుడు బాతాఖానీ పెడితే...అబ్బో బోలెడు టైమ్‌ ఖతమ్‌ అవుతుంది. దాని మానాన దాన్ని వదిలేద్దాం. ఈ రోజు మాత్రం సరదాగా ఓ గేమ్‌ ఆడదాం. ప్లేగ్రౌండ్‌ బ్యాగ్రౌండ్‌ లేని ఓ గేమ్‌ ప్లే చేద్దాం. అలాగని ఇండోర్‌ గేమ్‌ కాదు. బట్‌ అలాంటిదే. బ్రెయిన్‌ గేమ్‌ అన్నమాట. మేటర్‌ కంటిన్యూ చేయండి. గేమ్‌ స్ట్రాటజీ ఏంటో మీకే తెలుస్తుంది. సరే.. పైన ఉన్న ఫొటో చూడండోసారి. ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? అందాల భామ ప్రగ్యా జైస్వాల్‌ అని మీకు తెలుసు.

ఈ ఫొటోలో ఓ తేడా ఉంది. కనుక్కోగలిగారా? లేకపోతే ఇంకోసారి చూడండి. మళ్లీ మళ్లీ ప్రగ్యాని చూడండి. అబ్బా.. ఎన్నిసార్లు చూడాలి? అనుకుంటున్నారా. అయితే చిక్కుముడి విప్పేస్తాం. ఓసారి ప్రగ్యా జైస్వాల్‌ పెట్టుకున్న చెవి దిద్దులను చూడండి. రెండూ డిఫరెంట్‌గా ఉన్నాయి. ‘‘మనం రెండు డిఫరెంట్‌ సెట్స్‌ ఇయర్‌ రింగ్స్‌ని ట్రై చేసి నప్పుడు, ఒక సెట్‌ని సెలక్ట్‌ చేసుకుంటాం. అయితే పెట్టుకునేటప్పుడు ఆ సెట్‌ది ఒక చెవికి, మరో సెట్‌ది ఇంకో చెవికి పెట్టుకుంటేనే ప్రాబ్లమ్‌. అయితే ఒక్కోసారి మరచిపోతాం. అయినా గాబారా పడొద్దు. ఎందుకంటే మనం చెబితే తప్ప గుర్తుపట్టేవాళ్లు చాలా తక్కువ’’ అని ప్రగ్యా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement