ఆ దర్శకుడికి ‘నో’ చెప్పిన బాహుబలి

Prabhas Say No To Karan Johar Again - Sakshi

దేశ వ్యాప్తంగా ‘బాహుబలి’ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తర్వాత హీరో ప్రభాస్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్‌ నుంచి కూడా ఈ హీరోకు అవకాశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ బడా దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌, ప్రభాస్‌తో ఒక సినిమా తీయాలని భావించాడు. ప్రభాస్‌ భారీ రెమ్యూనరేషన్‌ డిమాండ్ చేయటం ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తలు వినిపించాయి. కరణ్‌ సినిమాలో నటించడానికి గాను ప్రభాస్‌ అక్షరాల ‘20కోట్ల’ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టుగా అప్పట్లో వార్తలు వినిపించాయి.

ప్రభాస్‌కు తెలుగు పరిశ్రమలో ఉన్న క్రేజ్‌తో ఆయన అంత పారితోషికాన్ని డిమాండ్‌ చేయడం పెద్ద విషయమేమి కాదు. కానీ బాలీవుడ్‌లో మొదటి సినిమాకే అంత పారితోషికాన్ని ఇంతవరకూ ఏ నటుడు అందుకోలేదు. దాంతో కరణ్‌ జోహర్‌ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడట. తాజాగా మరోసారి ప్రభాస్‌తో సినిమా తీయాలని ముందుకొచ్చాడు కరణ్‌ జోహర్‌. ఈ సారి కూడా ఈ దర్శకుడికి నిరాశే ఎదురయ్యింది.  ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ సినిమా షూటింగ్‌తో బిజిగా ఉన్నాడు. ఆ తరువాత జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని మరో సినిమా అంగీకరించ కూడాదని భావిస్తున్నాడు ప్రభాస్‌.  అందువల్లే మరోసారి కరణ్‌కు నో చెప్పాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top