సంతోష్‌కు వర్షంలాంటి హిట్‌ రావాలి

Prabhas appreciates Paper Boy Trailer - Sakshi

ప్రభాస్‌

ప్రభాస్‌ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘వర్షం’. ఆ చిత్రదర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. రాములు, నరసింహులు, వెంకట్‌తో కలసి దర్శకుడు సంపత్‌ నంది ఈ చిత్రాన్ని నిర్మించారు. జయశంకర్‌ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ని వీక్షించిన అనంతరం, చిత్రబృందానికి ప్రభాస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘వర్షం’ చిత్రంతో నాకు హిట్‌ వచ్చినట్లే ‘పేపర్‌ బాయ్‌’ సంతోష్‌ శోభన్‌కు కూడా మంచి విజయం ఇవ్వాలి. ట్రైలర్‌ బాగుంది. విజువల్స్‌ చాలా బావున్నాయి. నేను నటించిన ‘బిల్లా’ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన సౌందర్యరాజన్‌ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేయటం ఆనందంగా ఉంది. గీతా ఆర్ట్స్‌ లాంటి మంచి సంస్థ ‘పేపర్‌బాయ్‌’ సినిమా హక్కులను సొంతం చేసుకోవటం మరో మంచి విషయం’’ అన్నారు . ఈ నెల 31న ఈ చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top