ఇరవై అయిదుకు అంతా రెడీ | 'Pleasure To Announce My Next With Mahesh' - Vamshi Paidipally | Sakshi
Sakshi News home page

ఇరవై అయిదుకు అంతా రెడీ

Dec 18 2016 11:35 PM | Updated on Jul 25 2018 2:35 PM

ఇరవై అయిదుకు అంతా రెడీ - Sakshi

ఇరవై అయిదుకు అంతా రెడీ

మహేశ్‌బాబు హీరోగా నటించబోయే 25వ చిత్రానికి దర్శక–నిర్మాతలు ఖరారయ్యారు.

మహేశ్‌బాబు హీరోగా నటించబోయే 25వ చిత్రానికి దర్శక–నిర్మాతలు ఖరారయ్యారు. హీరోగా మహేశ్‌ మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ నిర్మాత సి. అశ్వినీదత్, మహేశ్‌ నటించిన మొదటి మల్టీస్టారర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నిర్మాత ‘దిల్‌’ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఊపిరి’తో మంచి విజయం అందుకున్న వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. అమెరికా నేపథ్యంలో మంచి కుటుంబ విలువలతో కూడిన కథను దర్శకుడు సిద్ధం చేశారట.

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ఏ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెలుగు, తమిళ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందట! దీని తర్వాత  డీవీవీ దానయ్య నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వం వహించనున్న చిత్రంలో మహేశ్‌బాబు నటిస్తారు. ఆ తర్వాత ఇరవై అయిదో సినిమా ఆరంభమవుతుందని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement