ప్రేమానురాగాల సమ్మేళనం

 planing movie shooting starts in hyderabad - Sakshi

మహేంద్ర, కులకర్ణి మమతా జంటగా రూపొందుతున్న చిత్రం ‘ప్లానింగ్‌’. బి.ఎల్‌. ప్రసాద్‌ దర్శకత్వంలో ఆర్‌.ఎస్‌. తిరివీధి నిర్మిస్తున్నారు. కన్నడ నటి అలీషా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. ప్రేమానురాగాల సమ్మేళనానికి సందేశాన్ని జోడించి తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో 5 పాటలు, 3 ఫైట్లు ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు ప్రసాద్‌. ‘‘రాజీ పడకుండా నిర్మిస్తున్నా. దర్శకుడు విజువల్‌ వండర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలీషా పాత్ర, ఆమె పై ఉండే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. ఉదయ్‌ కిరణ్‌ మంచి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు నిర్మాత. రంగసాయి, ఉరుకుందప్ప, సంతోష్, అతిథి, చైతన్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు: ఏడు కొండలు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top