తెర పైకి క్రికెటర్‌ బ్రావో | Peoples Media Factory signs up Bravo for short film | Sakshi
Sakshi News home page

తెర పైకి క్రికెటర్‌ బ్రావో

Jun 30 2019 5:50 AM | Updated on Jun 30 2019 5:50 AM

Peoples Media Factory signs up Bravo for short film - Sakshi

వివేక్‌ కూచిభొట్ల, బ్రావో, నటరాజ్‌

తక్కువ కాలంలోనే మంచి కాంబినేషన్‌తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకొన్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్‌ ఫిలింను ఎనౌన్స్‌ చేశారు. అది కూడా ప్రముఖ వెస్టీండీస్‌ ఆల్‌రౌండర్‌ డారెన్‌ బ్రావోతో కావడం విశేషం. ప్రస్తుతం సమంత ముఖ్యపాత్రలో ‘ఓ బేబి’, వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీమామ’ చిత్రాన్ని నిర్మిస్తోందీ సంస్థ. అలాగే అనుష్క, మాధవన్‌ కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘డారెన్‌ బ్రావోతో ఓ షార్ట్‌ ఫిలింను ప్లాన్‌ చేశాం’’ అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ తెలిపారు. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా శనివారం బ్రావో, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి ఒప్పందం జరిగింది. కోయంబత్తూర్, తమిళనాడు, వెస్ట్‌ండీస్‌లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు, టి.జి.విశ్వప్రసాద్, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నటరాజ్‌ పిళ్లై పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement