వెండితెరపై పవన్ కల్యాణ్ కొడుకు | Pawan Kalyan's son makes filmi debut | Sakshi
Sakshi News home page

వెండితెరపై పవన్ కల్యాణ్ కొడుకు

Sep 2 2014 6:49 PM | Updated on Mar 22 2019 5:33 PM

వెండితెరపై పవన్ కల్యాణ్ కొడుకు - Sakshi

వెండితెరపై పవన్ కల్యాణ్ కొడుకు

పవన్ గారాలబ్బాయి అకీరాను త్వరలో వెండితెరపై చూడవచ్చు.

పవన్ కల్యాణ్ అభిమానులకో శుభవార్త. పవన్ గారాలబ్బాయి అకీరాను త్వరలో వెండితెరపై చూడవచ్చు. పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న రేణు దేశాయ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ సినిమాలో అకీరా అతిథి పాత్రలో నటించాడు. అకీరా తెరంగేట్రం గురించి రేణు ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. 'ఇష్క్ వాలా లవ్ చిత్రంలో అకీరా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. నేను దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న చిత్రంలో అకీరా వెండితెరకు పరిచయం కావడం ఓ తల్లిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది' అని రేణు ట్వీట్ చేశారు. పవన్ అభిమానులకు ఆశ్చరకర విషయం చెబుతానని ఇంతకుముందే ప్రకటించిన రేణు.. అకీరా తెరంగేట్రం గురించి వెల్లడించారు. అకీరా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలను రేణు గతంలో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పవన్తో విడిపోయినా రేణు అతణ్ని ప్రశంసిస్తూ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement