బన్నీ కోసం రంగంలోకి పవన్‌

Pawan Kalyan Chief Guest for NPS Success Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డివైడ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో బన్నీ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. యాంగ్రీ యంగ్‌ సోల్జర్‌గా బన్నీ ఆకట్టుకున్నాడని విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పించారు. దీనికి తోడు వీకెండ్‌లో ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రమోషన్లను పెంచేపనిలో మేకర్లు బిజీగా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన చిత్ర సక్సెస్‌ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. దీనికి చీఫ్‌ గెస్ట్‌గా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హాజరుకానున్నారని టాక్‌. ఈ మధ్యే పవన్‌.. రామ్‌ చరణ్‌ రంగస్థలం సక్సెస్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్‌ రాకతో ‘నా పేరు సూర్య’ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్నది సినీ ట్రేడ్‌ పండితుల మాట. చూద్దాం ఇది ఏ మేర సాయపడుతుందో.

వక్కంతం వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్‌, నాగబాబు, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించారు. అనూ ఇమ్మాన్యూయేల్‌, అర్జున్‌ సర్జా, వెన్నెల కిషోర్‌, పోసాని, శరత్‌ కుమార్‌ తదితరులు నటించారు. బార్డర్‌కు వెళ్లాలని కలలు కనే కోపిష్టి సైనికుడు.. అందుకోసం తన క్యారెక్టర్‌ మార్చుకుంటాడా? అన్న కాన్సెప్ట్‌తో నా పేరు సూర్య చిత్రం తెరకెక్కింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top