కేసరికి జోడీగా.. | Parineeti Chopra joins the cast of Akshay Kumar starrer 'Kesari' | Sakshi
Sakshi News home page

కేసరికి జోడీగా..

Jan 11 2018 12:22 AM | Updated on Jan 11 2018 1:27 AM

Parineeti Chopra joins the cast of Akshay Kumar starrer 'Kesari'  - Sakshi

పాత్రల పరంగా వైవిధ్యం చూపించే హీరోల లిస్ట్‌లో అక్షయ్‌ కుమార్‌ పేరు ఉంటుంది. ‘ప్యాడ్‌మ్యాన్‌’లో సమాజానికి మేలు చేసే వ్యక్తిగా, బల్బీర్‌ సింగ్‌ బయోపిక్‌ ‘గోల్డ్‌’ సినిమాలో హాకీ ప్లేయర్‌గా, సంగీత దర్శకుడు గుల్షన్‌కుమార్‌ బయోపిక్‌లో టైటిల్‌ రోల్‌లో... ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేస్తున్నారు అక్షయ్‌కుమార్‌. ఇక, ‘2.0’లో అయితే ‘క్రౌమ్యాన్‌’ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. పక్షుల మనుగడ కోసం రోబోటిక్‌ టెక్నాలజీ వాడే వ్యక్తి పాత్రలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే.

తాజాగా మరో డిఫరెంట్‌ రోల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు అక్షయ్‌. ఆ చిత్రం పేరు ‘కేసరి’. ఇప్పటికే విడుదలై అక్షయ్‌ లుక్‌ ఆకట్టుకుంది. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  భారతీయ చరిత్రలతో జరిగిన పెద్ద యుద్ధాలలో ఓ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో కథానాయికగా పరిణీతీ చోప్రాను ఎంపిక చేశారు. ‘‘ఈ సినిమాలో పార్ట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందానికి థ్యాంక్స్‌’’ 
అన్నారు పరిణీతీ చోప్రా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement