‘నాకు పెళ్లీడు వచ్చే వరకూ ఎదురుచూడు’

Is Parineeti Chopra And Arjun Kapoor Get Married - Sakshi

హీరో, హీరోయిన్‌లు బయట ఎక్కడైనా జంటగా కనిపిస్తే వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం చేస్తారు. అంతటితో ఆగక పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నిస్తుంటారు. తాజాగా ఇలాంటి ప్రచారమే బాలీవుడ్‌ నటులు పరిణీతి చోప్రా, అర్జున్‌ కపూర్‌ల విషయంలో జరుగుతోంది. ప్రచారంతో ఊరుకోక ‘ఇంతకూ మీరిద్దరు వివాహం ఎప్పుడు చేసుకుంటారం’టూ నెటిజన్లు వీరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అభిమానుల అత్యుత్సాహానికి తగ్గట్టుగా పరిణితీ ‘నాకు డేట్స్‌ ఖాళీ లేవు’.. అంటే అర్జున్‌ కపూర్‌ ఏకంగా ‘నేనింకా చిన్న పిల్లవాడిని పెళ్లీడు రాలేదంటూ’ సమాధానమిచ్చారు.

ఇంతకు విషయం ఏంటంటే ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌, పరిణీతి జంటగా ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ బ్రైడ్స్‌ మ్యాగజైన్‌ ఫొటో షూట్‌లో పాల్గొని.. నూతన దంపతులుగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో ‘వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారం’టూ ఓ ఆంగ్ల మీడియా కథనాల్ని ప్రచురించింది. ఈ కథనంపై అర్జున్‌, పరిణీతి కాస్తా వెరైటీగా స్పందించారు.

ఈ విషయం గురించి పరిణీతి ‘నో...అర్జున్‌ కపూర్‌ నన్ను క్షమించు. నాకు డేట్లు ఖాళీగా లేవు. నా మేనేజర్‌ను సంప్రదించు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇందుకు బదులుగా అర్జున్‌ కపూర్‌ ‘నేనింకా చిన్నపిల్లాడినే. పెళ్లికి తొందరేం లేదు. పరిణీతి.. నాకు పెళ్లీడు వచ్చే వరకూ ఎదురుచూడు’ అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విటర్‌ సంభాషణ, ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

కొన్నేళ్ల క్రితం పరిణీతి, అర్జున్‌ జంటగా ‘ఇషక్‌జాదే’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం వీరిద్దరు ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ చిత్రంతో పాటు ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమాలో కూడా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top