నా మొదటి సినిమానే పెద్ద డైరెక్టర్‌తో..

Paperboy Hero Santhosh Shoba Special Chit Chat With Sakshi

పేపర్‌  బాయ్‌ హీరో సంతోష్‌ శోభ

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నా మొదటి సినిమానే సంపత్‌ నంది లాంటి పెద్ద డైరెక్టర్‌తో చేయటం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ డైరెక్టర్‌ శోభ తనయుడు, పేపర్‌ బోయ్‌ సినిమా హీరో సంతోష్‌శోభ అన్నారు. సినిమా ప్రొమోషన్లలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడారు.

అదృష్టంగా భావిస్తున్నా
నన్ను నమ్మి పేపర్‌బాయ్‌ సినిమాలో సంపత్‌నంది అవకాశం ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది సినిమాలా కాకుండా రియల్‌ క్యారెక్టర్స్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది. నేను డిగ్రీలో మాస్‌కమ్యూనికేషన్‌ చేశాను. మా నాన్న డైరెక్టర్‌ కావటం వల్ల మా చుట్టూ సినిమా వాతావరణమే ఉండేది. నా ఆలోచనలు ఎప్పుడూ సినిమా రంగం వైపు ఉండేవి. ఒక వేళ నేను హీరోను కాకపోయి ఉంటే సినిమాల్లోనే వేరే దాన్ని ఎందుకునేవాడ్ని తప్ప బయటికి మాత్రమే వెళ్లే అలోచనే లేదు. నాకు మెగాస్టార్‌ చిరంజీవి ఆదర్శం. ఆయన చేసిన కార్యెక్టర్లు అన్నీ నాకు చేయాలని ఉంది. హీరోయిన్‌ త్రిష అంటే ఇష్టం. ఆమెతో సినిమా చేయాలనేది నా కోరిక.

పేపర్‌బాయ్‌ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్‌ నంది టీం వర్క్స్, పవిత్ర క్రియేషన్స్, బీఎల్‌ఎన్‌ సినిమా పతాకంపై సంపత్‌ నంది, వెంకట్, నరసింహ ఈ సినిమా నిర్మించారు. సంతోష్‌ శోభన్, రియా సుమన్‌ హీరో హీరోయిన్లగా నటించారు. ఈ చిత్రానికి జయశంకర్‌ దర్శకత్వం వహించగా.. సంగీతం బీమ్స్‌ సిసిరోలియా అందించారు. ఆదివారం చిత్రబృందం వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో నిర్వహించింది. పేపర్‌బాయ్‌ టైటిల్‌ సాంగ్‌ని కాసర్ల శ్యామ్‌ అద్భుతంగా రాశారన్నారు. చంద్రబోస్‌కు తాను పెద్ద అభిమానిని, ఆయన ఈ సినిమాకు టైటిల్‌ సాంగ్‌ పాడారని తెలిపారు. సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ చిత్రం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. చిత్రంలో మరో లవ్‌సాంగ్‌ను ఎంవీవీ రిలీజ్‌ చేశారు.

సాగరతీరంలో ప్రీరిలీజ్‌ వేడుకలు
 పేపర్‌బాయ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఆదివారం రాత్రి సాగర తీరంలో జరిగింది. చిత్ర సహా నిర్మాత, డైరెక్టర్‌ సంపత్‌ నంది మాట్లాడారు. ప్రేమికులు తమ ప్రేమను ఎలా గెలిపించుకోవాలో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. హీరో సంతోష్‌ శోభ మాట్లాడుతూ పేపర్‌బాయ్‌ సినిమా వల్ల ఎంతో మంది ప్రేమికుల తల్లిదండ్రుల్లో మార్పు రావటం ఖాయమన్నారు. హీరోయిన్‌ రియా సుమన్‌ మాట్లాడుతూ వైజాగ్‌ చాలా అందంగా, ప్రశాంతంగా ఉందన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top