భారత సంతతి నటుడికి ఆస్కార్ అవార్డు | Oscar for Indian-origin actor, producer Rahul Thakkar in technical category | Sakshi
Sakshi News home page

భారత సంతతి నటుడికి ఆస్కార్ అవార్డు

Jan 20 2016 2:23 PM | Updated on Sep 3 2017 3:59 PM

భారత సంతతి నటుడికి ఆస్కార్ అవార్డు

భారత సంతతి నటుడికి ఆస్కార్ అవార్డు

ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం భారతీయులకు ప్రత్యేకంగా నిలవనుంది.

లాస్ ఏంజెలెస్: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డులు ప్రకటిస్తారు. దీనికంటే ముందు 10 సైంటిఫిక్, టెక్నికల్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సెస్ ప్రదానం చేయనుంది. ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవం భారతీయులకు ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఈసారి భారత సంతతికి చెందిన నటుడు, నిర్మాత రాహుల్ థక్కర్ అవార్డు అందుకోబోతున్నారు.

టెక్నికల్ ఎచీవ్ మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నట్టు ఆస్కార్ అవార్డ్స్ అధికార వెబ్ సైట్ లో పేర్కొంది. 'గ్రౌండ్ బ్రేకింగ్ డిజైన్'లో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్టు తెలిపింది. రాహుల్ థక్కర్, రిచర్డ్ చాంగ్ లకు సంయుక్తంగా ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement