ప్రేమికుల రోజు

Oru Aadhar love telugu remake lovers day released on feb 14 - Sakshi

జస్ట్‌ అలా అలవోకగా కన్ను కొట్టి కుర్రకారు హృదయాలను దోచేసుకున్నారు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’ టీజర్‌లో ప్రియా కన్ను కొట్టడం, ఆ టీజర్‌ వైరల్‌ అవ్వడం తెలిసిందే. రోషన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’. ఈ చిత్రానికి ఒమర్‌ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్‌ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్‌. వినోద్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో ఈ నెల 14న పేమికుల దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి బన్నీ (అల్లు అర్జున్‌) అందించిన సహకారాన్ని మర్చిపోలేం. తెలుగులో ప్రియా వారియర్‌ పాత్రకు సింగర్‌ లిప్సిక డబ్బింగ్‌ చెప్పారు. ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉన్నాయి. ఇందులో ఓ పాట ఆడియన్స్‌కు థియేటర్‌లో సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. మంచి బిజినెస్‌ జరిగింది’’ అని అన్నారు. ఈ సినిమాకు షాన్‌ రెహమాన్‌ స్వరకర్త.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top