నితిన్‌ ఈజ్‌ బ్యాక్‌ అనేలా భీష్మ టీజర్‌ | Nithiin Bheeshma Teaser Out | Sakshi
Sakshi News home page

నితిన్‌ ఈజ్‌ బ్యాక్‌ అనేలా భీష్మ టీజర్‌

Jan 12 2020 11:45 AM | Updated on Jan 12 2020 1:01 PM

Nithiin Bheeshma Teaser Out - Sakshi

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భీష్మ’ టీజర్ వచ్చేసింది. నిమిషానికి పైగా ఉన్న భీష్మ టీజర్‌లో నితిన్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. భీష్మ చిత్రాన్ని ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో యూత్ ఫుల్ మూవీగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందన్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. వెటకారమైన పంచ్‌లతో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం కామెడీగా సాగింది.

చదవండి: వివాదాల 'దర్బార్‌'

చదవండి:  టీజర్‌ గురించి నితిన్‌ ఏమన్నాడంటే?

'నీ పేరేంటని నితిన్‌ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ అడిగితే.. భీష్మ అంటాడు. అప్పుడు ఆయన భీష్మ కాదు భీష్మ సర్ అనాలి అంటాడు. ఇందుకు నితిన్ స్పందిస్తూ అంటే నా పేరుకి సర్ యాడ్ చేస్తే బాగోదేమో అని వేసిన పంచ్ నవ్వులు పూయిస్తోంది. ఏం చేస్తుంటావ్ అని అడిగితే.. మీమ్స్ చేస్తుంటానని చెప్తాడు. కానీ రష్మిక దగ్గర మాత్రం ఐఏఎస్, ఏసీపీ అని తిరుగుతుంటాడు. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దబ్బకాయ అంత ఉందండి' అంటూ నితిన్ బాధపడుతూ చెప్తున్న డైలాగ్ కామెడీగా ఉంది. సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement