నయనతో వేలక్కారన్‌ ఏం చేస్తున్నారు? | nayanatara and sivakarthikeyan new movie ? | Sakshi
Sakshi News home page

నయనతో వేలక్కారన్‌ ఏం చేస్తున్నారు?

Mar 24 2017 1:52 AM | Updated on Sep 5 2017 6:54 AM

నయనతో వేలక్కారన్‌ ఏం చేస్తున్నారు?

నయనతో వేలక్కారన్‌ ఏం చేస్తున్నారు?

నయనతారతో వేలక్కారన్‌ ఏం చేస్తున్నారన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి శివకార్తికేయన్‌ అభిమానుల్లో

నయనతారతో వేలక్కారన్‌ ఏం చేస్తున్నారన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి శివకార్తికేయన్‌ అభిమానుల్లో చాలానే ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర వ్యాఖ్య స్థాయి నుంచి స్టార్‌ హీరోగా ఎదిగిన నటుడు శివకార్తికేయన్‌. వరుత్తపడాద వాలిభర్‌ సంఘం చిత్రం నుంచి నటుడిగా ఈయన దిన దిన ప్రవర్థమానం అన్నట్లు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. ఆ మధ్య నటించిన రెమో చిత్రం శివకార్తికేయన్‌ను ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది.

తాజాగా టాప్‌ కథానాయకి నయనతారతో యుగళగీతాలు పాడుతున్నారు. గతంలో రజనీకాంత్‌ నటించిన హిట్‌ చిత్రం వేలైక్కారన్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకుడు. 24 ఏఎం స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటి స్నేహ, ప్రకాశ్‌రాజ్, ఆర్‌జే.బాలాజీ, తంబిరామయ్య నటిస్తున్నారు. అనిరుద్‌ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందట. ప్రస్తుతం చెన్నైలోని ఒక స్టూడియోలో వేసిన బ్రహ్మాండమైన సెట్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న వేలైక్కారన్‌ చిత్ర యూనిట్‌ తదుపరి 35 రోజులు పాటు మలేషియాలో మకాం పెట్టనున్నారట.

సమాజంలోని ముఖ్యమైన సమస్యను ఆవిష్కరించే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లు, చిత్రాన్ని వినాయక చతుర్థసి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement