వేసవికి నరకాసురుడు

naragasooran first look release - Sakshi

అరవింద్‌ స్వామి, సందీప్‌ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నరకాసురుడు’. తమిళంలో తెరకెక్కిన ‘నరగాసురన్‌’ సినిమాకు ఇది తెలుగు వెర్షన్‌. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ వేసవిలోనే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది’’ అన్నారు. ఆత్మిక, ఇంద్రజిత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మణికందన్, సంగీతం: రాన్‌ ఏతాన్‌ యోహాన్, కెమెరా: సుజిత్‌ సారంగ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top