రిలీజ్ కు ముందే బిజినెస్ అయిపోయింది | Nani new movie already sold out | Sakshi
Sakshi News home page

రిలీజ్ కు ముందే బిజినెస్ అయిపోయింది

Nov 8 2015 12:15 PM | Updated on Sep 3 2017 12:14 PM

రిలీజ్ కు ముందే బిజినెస్ అయిపోయింది

రిలీజ్ కు ముందే బిజినెస్ అయిపోయింది

ఇటీవల కాలంలో సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న యంగ్ హీరో నానికి 'భలే భలే మొగాడివోయ్' సక్సెస్ కొత్త కిక్ ఇచ్చింది. లో బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్...

ఇటీవల కాలంలో సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న యంగ్ హీరో నానికి 'భలే భలే మగాడివోయ్' సక్సెస్ కొత్త కిక్ ఇచ్చింది. లో బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. కరెక్ట్ కంటెంట్ ఉంటే చిన్న సినిమా కూడా 50 కోట్ల వసూళ్లను రాబట్టగలదని ప్రూవ్ చేసింది ఈ సినిమా.

భలే భలే మగాడివోయ్ సినిమాతో నాని మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్ సీస్ లో రికార్డు కలెక్షన్లు వసూళు చేయటం నానికి ప్లస్ అయ్యింది. ఇదే జోష్ తో నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాకు షూటింగ్ కూడా పూర్తి కాకముందే బిజినెస్ జరిగిపోయిందట.

ప్రస్తుతం నాని, అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో పూర్తి కానుంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పూర్తయ్యింది. ఈ డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement