మ్యూజికల్‌ మ్యాజిక్‌

Nani-Nagarjuna's multi-starrer september released - Sakshi

డాన్‌ అండ్‌ డాక్టర్‌. ఒకరు బ్లాక్‌ కోట్‌. మరొకరేమో వైట్‌ అండ్‌ వైట్‌. ఒకరి అడ్డా డెన్‌. మరొకరిది హాస్పిటల్‌. మరి వీళ్లిద్దరికీ ఫ్రెండ్‌షిప్‌ ఎలా కుదిరింది? అనే విషయం తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అని శ్రీరామ్‌ ఆదిత్య అంటున్నారు. నాగార్జున, నానీ హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ రూపొందుతోన్న విషయం తెలిసిందే. 

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  నాగార్జునకు జోడీగా ఆకాంక్షా సింగ్, నానీకి జోడీగా రష్మికా మండన్నా యాక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ 65 శాతం కంప్లీట్‌ అయిందని సమాచారమ్‌. ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో మ్యూజిక్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఉండబోతోందట. ఆల్రెడీ ఇందులో ఆరు పాటలను సంగీత దర్శకుడు మణిశర్మ కంపోజ్‌ చేశారు. ఈ పాటలన్నీ బిట్స్‌లా సినిమా మొత్తం వాడనున్నారట. ఈ సినిమాలో నాగార్జున తన పార్ట్‌ షూట్‌ను ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుందని సమాచారమ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top