గుడ్‌ డాక్టర్‌

Nagarjuna Nani next gets a release date - Sakshi

డాక్టర్‌గా హీరో నాని చార్జ్‌ తీసుకున్నారు. కేవలం జీతం కోసం మాత్రమే పనిచేసే డాక్టర్‌ కాదాయన. పక్కవారి జీవితాలను కూడా బాగుచేయాలనే సామాజిక బాధ్యత ఉన్న గుడ్‌ డాక్టర్‌. అందుకే.. తన హాస్పిటల్‌కు వచ్చినవారికి అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారట. అది సరే.. డాక్టర్‌గా నానీ ఎప్పటి నుంచి ప్రాక్టీస్‌ స్టార్ట్‌ చేశారు అంటే.. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో మూవీ స్టార్ట్‌ అయినప్పటి నుంచి. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్‌ ఓ మల్టీస్టారర్‌ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో నాగార్జున డాన్‌గా నటిస్తుండగా ఆయనకు జోడీగా ఆకాంక్షాసింగ్‌ చేస్తున్నారు.  డాక్టర్‌గా చేస్తున్న నానితో రష్మిక మండన్నా జోడీ కట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో నానీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఓ సన్నివేశంలో నాని దగ్గరకు  పోలీస్‌ జీప్‌లో వస్తారట రష్మిక. ఆమె ఎమైనా పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారా? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌. యూరప్‌లో హాలీడేలో ఉన్న నాగార్జున వచ్చిన వెంటనే షూట్‌లో జాయిన్‌ అవుతారట. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచనట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top