డీడీ సెప్టెంబర్‌కి రెడీ

Nagarjuna and Nani starrer titled Devadas - Sakshi

శాంతాభాయ్‌ మెమోరియల్‌ చారిటీ హాస్పిటల్‌తో దేవదాస్‌లకు సంబంధం ఉంది. ఈ లింక్‌ ఏంటీ? అనేది సెప్టెంబర్‌లో తెలుస్తుంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా సి. ధర్మరాజు సమర్పణలో వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ మూవీకి ‘దేవదాస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

‘దేవదాస్‌’ అనగానే ఏయన్నార్‌ నటించిన సినిమా గుర్తుకు రాకమానదు. కానీ ఆ ‘దేవదాసు’ వేరు. ఇది వేరు. ఈ సినిమాలో దేవదాస్‌ అంటే ఒకరు కాదు. నాగార్జున డాన్‌ దేవ. నాని డాక్టర్‌ దాస్‌. నాగార్జునకు జోడీగా ఆకాంక్షా సింగ్, నాని సరసన రష్మికా మండన్నా నటిస్తున్నారు. ‘‘దాస్, నేను సెప్టెంబర్‌లో వస్తున్నాం. డీడీ’’ అన్నారు నాగార్జున. ‘‘దేవ, నేను సెప్టెంబర్‌లో వస్తున్నాం’’ అన్నారు నాని. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరకర్త.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top