మూడు చిక్కులు, రెండు ప్రేమలు..? | nagaram movie trailer released | Sakshi
Sakshi News home page

మూడు చిక్కులు, రెండు ప్రేమలు..?

Sep 25 2016 6:37 PM | Updated on Sep 15 2019 12:38 PM

మూడు చిక్కులు, రెండు ప్రేమలు..? - Sakshi

మూడు చిక్కులు, రెండు ప్రేమలు..?

సందీప్ కిషన్, రెజీనా జంటగా తమిళ, తెలుగు భాషల్లో నిర్మించిన ‘నగరం’ సినిమా ట్రైలర్ విడుదలైంది.

సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  తమిళ, తెలుగు భాషల్లో నిర్మించిన  ‘నగరం’  సినిమా ట్రైలర్ విడుదలైంది. సందీప్ కిషన్ వెరైటీ లుక్ తో ఆకట్టుకున్నాడు. నాలుగు బతుకులు, మూడు చిక్కులు, రెండు ప్రేమలు అంటూ ట్రైలర్ లో చూపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సందీప్ కిషన్ సినిమాల్లో ఓ మంచి ఎంటర్‌టైనర్‌గా ‘నగరం’ ఉంటుందని నమ్ముతున్నామని నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ అన్నారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుందని మరో నిర్మాత రాజేశ్ దండా చెప్పారు. లోకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జావెద్ సంగీతం అందించాడు. త్వరలోనే ‘నగరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సందీప్ కిషన్, రెజీనా కాంబినేషన్ లో క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశి ‘నక్షత్రం’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement