‘కంగనా రియల్‌ డైరెక్టర్‌ కాదు’

Mishti Chakraborty Expressed her Shock at Watching the Manikarnika Final Film - Sakshi

మణికర్ణిక సినిమాపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్న చిత్ర నటీనటులు నుంచి మాత్రం విమర్శలే వినిపిస్తున్నాయి. దర్శకుడు క్రిష్.. కంగనా తీరుపై విరుచుకుపడ్డారు. సోనూ సూద్‌ పాత్రను తగ్గించాలన్న నిర్ణయం కంగనా తీసుకోవటం పాటు మరిన్ని మార్పులకు ఒత్తిడి చేయటంతోనే తాను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా క్రిష్ తెలిపారు. సోనూసూద్‌ కూడా తన పాత్రను ముందు చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతోనే ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపాడు.

తాజా మణికర్ణిక సినిమాలో కీలక పాత్రలో నటించిన మిస్తీ చక్రవర్తి, కంగనా తీరుపై స్పందించారు. ‘క్రిష్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న తరువాత అబద్దాలు చెప్పి కంగనా, కమల్‌ జైన్‌ను నా డేట్స్‌ అడిగారు. సినిమాలో నీది కీలక పాత్ర సినిమా అంత నువ్‌ కనిపిస్తావు. అందుకే మరిన్ని డేట్స్ అవసరం పడ్డాయని చెప్పారు. కానీ క్రిష్ తీసిన  సన్నివేశాలను కూడా కట్‌ చేసి, నా పాత్రను కొన్ని సీన్స్‌కే పరిమితం చేశార’ని తెలిపారు మిస్తీ.

అంతేకాదు కంగనా తన పాత్రను మరింతగా ఎలివేట్ చేసేందుకు ఇతర పాత్రల నిడివిని తగ్గించారని ఆరోపించారు. అంతేకాదు కంగనా నిజమైన డైరెక్టర్‌ కాదని, డైరెక్టర్‌ తన సినిమాలో ప్రతీ పాత్రను ప్రేమిస్తారని.. కానీ కంగనా కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలో మార్పులు చేశారని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top