ఇతనికి మెంటల్! | Mental Police first look launch | Sakshi
Sakshi News home page

ఇతనికి మెంటల్!

Jan 27 2016 11:32 PM | Updated on Sep 17 2018 6:26 PM

ఇతనికి మెంటల్! - Sakshi

ఇతనికి మెంటల్!

పోలీస్ ఆఫీసర్‌గా ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాల్లో శ్రీకాంత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు.

పోలీస్ ఆఫీసర్‌గా ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాల్లో శ్రీకాంత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు. అంత అద్భుతంగా నటించారాయన. ఇప్పుడు మరోసారి పోలీస్ అధికారిగా ‘మెంటల్ పోలీస్’ చిత్రంలో నటిస్తున్నారు. కరణం పి.బాబ్జీ(శ్రీను) దర్శకత్వంలో వివిఎస్‌ఎన్‌వి ప్రసాద్, వివి దుర్గాప్రసాద్ అనగాని ఈ చిత్రం నిర్మిస్తున్నారు. దర్శకుడు వి. సముద్ర, శ్రీకాంత్ ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

 శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘కథ విన్నప్పుడు మంచి హిట్టు అవుతుందని అనుకున్నాను. నాపై నమ్మకంతో దర్శకుడు నా కోసమే రాసుకున్న కథ ఇది’’ అన్నారు. ‘‘శ్రీకాంత్‌గారు చేస్తానంటేనే ఈ సబ్జెక్ట్‌తో ముందుకొచ్చా’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ‘‘మాకిది తొలి చిత్రమైనా సహకరిస్తున్న అందరికీ థ్యాంక్స్ ’’ అని నిర్మాతలు తెలిపారు. సమర్పణ: దాసరి అరుణాదేవి, అనగాని ఫిలింస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement