నాకు పవన్, మహేశ్‌ తెలుసు!

నాకు పవన్, మహేశ్‌ తెలుసు!


‘‘నాకు తెలుగు రాదు. అందువల్ల, తెలుగులో ఇంతకుముందు అవకాశాలొచ్చినా అంగీకరించలేదు. భాష రానప్పుడు దర్శకుడు ఆశించినట్లుగా చేయలేనేమోననే భయం. ‘ఒరువడక్కన్‌ సెల్ఫీ’ స్ఫూర్తితో రూపొందిన ఈ ‘మేడమీద అబ్బాయి’కి మలయాళంలో సినిమా తీసిన ప్రజిత్‌గారే దర్శకుడని ఒప్పుకున్నా’’ అన్నారు నిఖిలా విమల్‌. ‘అల్లరి’ నరేశ్, నిఖిలా విమల్‌ జంటగా బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించిన ‘మేడమీద అబ్బాయి’ ఈ నెల 8న విడుదలవుతోంది. నిఖిలా విమల్‌ చెప్పిన విశేషాలు...



► తెలుగులో నా తొలి చిత్రమిది. సింధు అనే సున్నితమైన అమ్మాయి పాత్రలో కనిపిస్తా. దర్శకుడు అవ్వాలనే ఓ యువకుడి జీవితం ఒక అమ్మాయి వల్ల ఎలాంటి మలుపు తిరిగింది? అనేది చిత్రకథ. కథంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వన్‌ సైడ్‌ లవ్‌ నేపథ్యంలో ట్విస్టులతో రూపొందింది.



► లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ వల్ల ఇంతకు ముందు తెలుగు సినిమాలేవీ చూడలేదు. ఈ సినిమాకు ముందు నరేశ్‌ గురించి తెలియదు. తర్వాత ఆయన సినిమాలు చూశా, ఆయన గురించి తెలుసుకున్నా. వెరీ ఫ్రెండ్లీ కో–స్టార్‌. తెలుగులో నాకు తెలిసిన హీరోలు ఇద్దరే... మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్‌. వారిని నేనెప్పుడూ కలవలేదు. కానీ, వాళ్లు బాగా తెలిసినవారిలా అనిపిస్తుంటారు.



ప్రస్తుతం మోహన్‌బాబుగారు హీరోగా నటిస్తున్న ‘గాయత్రి’లో ఆయన కూతురిగా నటిస్తున్నా. ఫుల్‌ గ్లామరస్‌ రోల్స్‌ నాకు సరిపోవు. అందుకే, వాటికి నేను దూరం. యాక్టింగ్‌కీ, గ్లామర్‌కీ ఈక్వల్‌ ఇంపార్టెన్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేయాలనుంది. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నా. త్వరలో మాట్లాడతా. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top