దమ్ముందా? | Mayamal will release on 30th of this month | Sakshi
Sakshi News home page

దమ్ముందా?

Jun 21 2017 12:41 AM | Updated on Sep 5 2017 2:04 PM

దమ్ముందా?

దమ్ముందా?

అదొక మహల్‌. అందులో ఏముందో చూడాలనే ఆసక్తి కలిగితే మాత్రం గుండె నిండా దమ్మూ ధైర్యం కావాలి.

అదొక మహల్‌. అందులో ఏముందో చూడాలనే ఆసక్తి కలిగితే మాత్రం గుండె నిండా దమ్మూ ధైర్యం కావాలి. ఎందుకంటే అదొక మాయా మహల్‌. దాని గురించి తెలిసినవాళ్లు ఆమడ దూరం ఉంటారు. కానీ, కొందరు ధైర్యం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘మాయామాల్‌’. డేర్‌ టు ఎంటర్‌... అనేది ఉపశీర్షిక.

దిలీప్, ఈషా, దీక్షా పంత్‌ ముఖ్య తారలుగా గోవింద్‌ లాలం దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కేవీ హరికృష్ణ, చందు ముప్పాళ్ళ, నల్లం శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. గోవింద్‌ లాలం మాట్లాడుతూ– ‘‘హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది.  మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. సినిమాలో విలన్‌ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్‌’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్, యాక్షన్‌: విజయ్‌.
7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement