తక్కువ బడ్జెట్‌ కానీ ఎక్కువ వసూళ్లు..

Mardaani 2: Day 2 Box Office Collections - Sakshi

నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. బాలీవుడ్‌ హీరోయిన్‌ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు అంతంతమాత్రంగానే వసూలు చేసింది. ఇది చిత్రబృందాన్నిఅయోమయానికి గురిచేసినప్పటికీ అనూహ్యంగా రెండోరోజు విపరీత వసూళ్లను సాధించింది. సాధారణంగా ఏ సినిమానైనా విడుదలైన తర్వాతి రోజుల్లో 50 నుంచి 60 శాతం వసూళ్లు పుంజుకుంటాయి.

కానీ మర్దానీ 2 అందుకు భిన్నంగా రాకెట్‌ స్పీడులో రెండోరోజే 75 శాతం వసూళ్లు పుంజుకున్నాయి. ఈ సినిమా శుక్రవారం సుమారు రూ.4 కోట్లు అందుకోగా శనివారం ఏకంగా రూ. 6 కోట్ల పైచిలుకు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తంగా రూ.10 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఇక బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘దబాంగ్‌ 3’ శుక్రవారం రిలీజ్‌ అవుతుండటంతో మర్దానీ 2 చిత్రానికి వసూళ్లు తగ్గే అవకాశం లేకపోలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top