పవర్‌ ప్యాక్‌గా మనోజ్‌.. ఒకే ఫ్రేమ్‌లో త్రీ షేడ్స్‌ | Manchu Manoj New Movie Aham Brahmasmi First Look Released | Sakshi
Sakshi News home page

ఒకే ఫోటోలో మూడు షేడ్స్‌లో మనోజ్‌

Mar 4 2020 6:20 PM | Updated on Mar 4 2020 6:29 PM

Manchu Manoj New Movie Aham Brahmasmi First Look Released - Sakshi

మంచు మనోజ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘అహం బ్రహ్మాస్మి’. ఓ వైవిధ్యమైన పాత్రలో మనోజ్‌ కనిపించనున్నారు. కొంత కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్‌ ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలే నెలకొన్నాయి. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో మంచు మనోజ్, నిర్మలాదేవి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 6 నుంచి ప్రారంభం కానుంది.

ఇటీవలే సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేయగా.. తాజాగా సినిమా ఫస్ట్‌ లుక్‌ను మనోజ్‌ బుధవారం విడుదల చేశారు. ‘అహంబ్రహ్మాస్మి ఫస్ట్ లుక్ వచ్చేసింది. కొంత కాలంగా నేను తెరపై కనిపించలేదు. అందుకే ఇప్పుడు పవర్‌ ప్యాక్‌ మూవీతో వస్తున్నాను. ఈ కామెడీ, యాక్షన్‌ సినిమాతో మీ రోమాలు నిక్కపొడుచుకోవటం ఖాయం’. అంటూ ట్వీట్‌ చేశారు. ఒకే ఫోటోలో మూడు షేడ్స్‌లో మనోజ్‌ కనిపిస్తున్నారు. కోపం, చిరునవ్వు, రౌద్రంగా ఉన్న మనోజ్‌ పోస్టర్‌పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు. 

చదవండి:
కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్‌
వ్యక్తిత్వం లేనివాడు, నీచుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement