ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది

Published Fri, Jul 20 2018 12:34 AM

Manchu Lakshmi talks about her efforts in 'Wife of Ram' - Sakshi

‘‘ఒక యాడ్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ సమయంలో దర్శకుడు విజయ్‌ని కలిసినప్పుడు అతను చెప్పిన కథ నచ్చింది. ఆ కథలో దీక్ష పాత్ర బాగా నచ్చడంతో ఈ సినిమా చేశా. విజయ్‌ వర్కింగ్‌ స్టైల్‌ వండర్‌ఫుల్‌. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుందనే నమ్మకం ఉంది’’ అని మంచు లక్ష్మీ అన్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మీ మంచు నిర్మించిన చిత్రం ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’. విజయ్‌ యెలకంటి దర్శకుడు. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ – ‘‘దీక్ష పాత్రకు లక్ష్మీ మంచు పూర్తి న్యాయం చేశారు.

ఇందులో ఏ సీన్‌ కూడా సినిమేటిక్‌గా ఉండదు. సహజంగా జరుగుతున్నట్లే ఉంటుంది. రఘు దీక్షిత్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఓ హైలైట్‌. సామల భాస్కర్‌ కెమెరా, తమ్మిరాజు ఎడిటింగ్‌ అద్భుతం’’ అన్నారు. ‘‘బిగ్‌ బాస్‌ షో నుంచి బయటకు వచ్చాక వచ్చిన మొదటి అవకాశం ఇది. ఈ సినిమాలో చేసిన పాత్ర నా కెరీర్‌కి మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అని ఆదర్శ్‌ అన్నారు. ‘‘పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో 27 రోజుల్లో షూటింగ్‌ పూర్త చేశాం. ఈ కథతో నేను చేసిన ప్రయాణాన్ని మరచిపోలేను’’ అని సామల భాస్కర్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement