థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ దివాలీ గిఫ్ట్‌

Making video of Thugs Of Hindostan  - Sakshi

సాక్షి, ముంబై: మోస్ట్‌ ఎవైటింగ్‌  బాలీవుడ్‌ మూవీ  ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మరో మేకింగ్ వీడియో అభిమానులను కట్టి పడేస్తోంది.  అమితాబ్- ఆమీర్‌ఖాన్- కత్రినా- ఫాతిమా కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను పలకరించనున్న తరుణంలో విడుదలైన ఈ  వీడియో ప్రాధాన్యతను సంతరించుకుంది.  దీపావళి సందర్భంగా నవంబర్ 8న  భారీ ఎత్తున రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నాలుగు నిమిషాల నిడివిగల మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్‌కి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన రకరకాల వీడియోలు సినీలవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకున‍్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే తాజా వీడియో కూడా హల్‌ చల్‌ చేస్తోంది.

మరోవైపు ఈ సినిమాకున్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ సినిమా టికెట్ల ధరలను దాదాపు 10శాతం పెంచేశారట. ఇది రణబీర్‌ కపూర్‌ నటించిన  బయోపిక్‌ ‘సంజూ’  సినిమా  టికెట్ల కంటే 10శాతం ఎక్కువట.   అంటే  సుమారు 300కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన  ఈ చిత్రం రాబడిని కేవలం 15రోజుల్లోనే రాబట్టాలని  చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top